హైద‌రాబాద్: లీడ్ ఇండియా ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో అంత‌ర్జాతీయ మ‌హిళ దినోత్స‌వం వేడుక‌లు హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్బంగా ప‌వ‌ర్ ఉమెన్ 2022గా ఎంపికైన మ‌హిళ‌ల‌కు అవార్డులు అందించి స‌త్క‌రించారు. ప‌వ‌ర్ ఉమెన్ విన్న‌ర్ 2022గా మిస్ తెలంగాణ 2018 సంధ్య జెల్ల అవార్డు అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డు అలీప్ ఈ భాగ‌స్వామిగా ఉంది. లీడ్ ఇండియా ఫౌండేష‌న్, డాక్ట‌ర్ అబ్దుల్ క‌లాం విజ‌య్ 2020 ఆలోచ‌న, నాణ్య‌మైన విద్యా, మ‌హిళా సాధికార‌త‌, భ‌విష్య‌త్తు త‌రాల‌కు శాంతి సామ‌ర‌స్యాన్ని నెల‌కొల్ప‌డానికి ఆధ్యాత్మిక కుటుంబాల‌ను అభివృద్ది చేయ‌డం వంటి ల‌క్ష్యంతో స్థాపించారు.

శిల్ప‌క‌ళా వేదిక‌లో ఘ‌నంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. శేర్లింగంప‌ల్లి ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ, న‌టి జీవిత‌, లీడ్ ఇండియా బ్రాండ్ అంబాసిడ‌ర్ నేహాస‌క్సెనా, లీడ్ ఇండియా ఫౌండేష‌న్ ప్రెసిడెంట్ డా. హ‌రికృష్ణ మారం, Global CEO & Director Ritzy Group Europe ఎమ్మెన్నార్ గుప్త, ప‌వ‌ర్ ఉమెన్ విన్న‌ర్ అనురాధా ఒబిలిశెట్టి (దుబాయ్), ప‌వ‌ర్ ఉమెన్ విన్న‌ర్ మోహ‌న ఇందుకూరి, ప‌వ‌ర్ ఉమెన్ విన్న‌ర్ ప‌ద్మ‌జ మానెప‌ల్లి త‌దిత‌రులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.