ఫ్రీమాంట్ (క్యాలిఫోర్నియా): తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (TDF-USA) ఆధ్వర్యంలో అమెరికా, కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రీమాంట్ నగరంలోని లేక్ ఎలిజబెత్ సెంట్రల్ పార్క్‌లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు.
ప్రతి సంవత్సరం సంప్రదాయ పద్ధతిలో జరిగే ఈ బతుకమ్మ వేడుకలో ఆటలు, పాటలతో వాతావరణం ఉత్సాహంగా మారింది. ఈ సారి సుమారు వెయ్యిమంది తెలంగాణ ఎన్నారై మహిళలు, కుటుంబ సభ్యులు, అతిథులు పాల్గొన్నారు. మహిళలు అలంకరించిన బతుకమ్మలను తీసుకువచ్చి పిల్లలు, పెద్దలతో కలిసి ఆడిపాడి పండుగను వైభవంగా జరిపారు.
సముద్రా సిల్క్స్ తరఫున అందంగా పేర్చిన ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేయడం వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా టిడిఎఫ్ ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు రాజారెడ్డి వట్టే పాల్గొన్నారు.
కార్యక్రమ నిర్వాహకులు స్రవంతి కరకాల, పల్లవి ముసుకుల, సింధి మేకల, సంధ్య నలమచ్చు, సమత వట్టిపెల్లి, లావణ్య గూడూరు, అనుపమ, ప్రీతి అనంతునితో పాటు టీడీఎఫ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మణికొండ వచ్చిన అతిథులకు, స్పాన్సర్లకు (దోశా పాలస్, సముద్రా సిల్క్స్) కృతజ్ఞతలు తెలిపారు.


https://www.globaltimes.tv/index.php/2023/05/18/swadesam-your-trusted-partner-for-nri-services/
https://www.globaltimes.tv/index.php/2023/05/18/swadesam-your-trusted-partner-for-nri-services/



