హైదరాబాద్ నగరంలో ప్రముఖ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ‘అలంకార ఈవెంట్ డెకార్’ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. నెక్సస్ మాల్ సమీపంలో ఉన్న ‘24 ఫ్రేమ్స్ వెడ్డింగ్ ఫిల్మ్స్’ ఇప్పటివరకు వివాహాలకి only ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలు అందించేవారు. ఇప్పుడు మరింత విస్తృతంగా అడుగులు వేసుతూ, పూర్తిస్థాయి ఈవెంట్ ప్లానింగ్, డెకరేషన్ సేవలతో ‘అలంకార ఈవెంట్ డెకార్’ అనే కొత్త బ్రాండ్‌ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హాజరై, సంస్థను లాంచ్ చేశారు. ప్రత్యేకత ఏమిటంటే, ఈ సంస్థ అధినేత ఫణి గోగిరెడ్డి గతంలో మంచు మనోజ్ హీరోగా నటించిన Mr. నోకియా చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు.
ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ— “ఫణి గారు ఇప్పటికే సినిమాటోగ్రఫీ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లోనూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ‘అలంకార’ సంస్థకి నా శుభాకాంక్షలు”—అని తెలిపారు.
వివాహాలు, ప్రైవేట్ పార్టీలు, కార్పొరేట్ ఈవెంట్లు, ఇతర కార్యాక్రమాలకు వినూత్నంగా డెకరేషన్, ప్లానింగ్ సేవలందించనున్నట్లు ‘అలంకార ఈవెంట్ డెకార్’ ప్రతినిధులు తెలిపారు.
———–