కాలిఫోర్నియా: డబ్లిన్ నగరంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్‌ (TDF-USA) ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు వెయ్యి మంది తెలంగాణ ఎన్నారై వనితలు, కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్ధంగా పాల్గొని బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో సందడి చేశారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా టిడిఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు రాజా రెడ్డి వట్టే హాజరై మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. నిర్వాహకులు కీర్తి మణికొండ, సరిత రాజిడి, వందన, సరిత కేతిరెడ్డి, భార్గవి, సరిత రావి, శ్వేత, దివ్య పల్లవి, స్రవంతి రేవూరి, అర్పిత తదితరులు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.

టిడిఎఫ్ యూఎస్ఏ అధ్యక్షుడు శ్రీనివాస్ మణికొండ మాట్లాడుతూ, “గత 25 ఏళ్లుగా అమెరికాలో నిరంతరంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం మాకు గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సాంస్కృతిని కాపాడే సంస్థగా టిడిఎఫ్ నిలుస్తోంది” అని అన్నారు. భవిష్యత్తులోనూ తెలంగాణలో సాంస్కృతిక, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

టిడిఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “అమెరికాలో నిర్వహించిన ఈ బతుకమ్మ పండుగ మన సంప్రదాయ గౌరవానికి నిదర్శనం. ఎన్నారైలు ఇలాగే మన సంస్కృతిని కాపాడాలని ఆశిస్తున్నాను” అన్నారు. చివరగా నిర్వాహకులు స్పాన్సర్లకు, పాల్గొన్నవారికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *