ఒక దర్శకుడు తన సినిమా కోసం చూపే కృషి, అంకితభావం చెప్పనవసరం లేదు. ఎన్నో అడ్డంకులు, ఒడిదుడుకులు ఎదురైనా, తన కలను సాకారం చేసేందుకు ప్రాణం పెట్టి ముందుకు సాగుతాడు. అలాంటి అచంచలమైన పట్టుదలతో ఏడు సంవత్సరాల పాటు తన కలల ప్రాజెక్ట్ ‘అరి’ కోసం ప్రయాణం చేసిన వ్యక్తి దర్శకుడు జయశంకర్.

 

ఈ చిత్రానికి కథ సిద్ధం చేసుకోవడానికి ఆయన హిమాలయాల వైపు పయనమయ్యారు. అనేకమంది ఆధ్యాత్మిక గురువులను కలుసుకుని, ఆశ్రమాల్లో గడిపారు. అక్కడి నుండి పొందిన అనుభవాలతో, మనిషి ఆత్మలోని షడ్వర్గాలపై (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య) పట్టు సాధించారు. అలా ఎప్పుడూ సిల్వర్ స్క్రీన్‌పై రాని కాన్సెప్ట్‌ను మూడు సంవత్సరాలు కష్టపడి కథగా మలచుకున్నారు.

నాలుగేళ్ల చొరవతో రూపొందిన ‘అరి’ చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ దీర్ఘమైన ప్రయాణంలో జయశంకర్ జీవితానికి మూలస్థంభాలైన తన తండ్రి వంగ కనకయ్య మరియు బావ కె.వి. రావులను కోల్పోయాడు. వారి స్మృతులకే ఈ సినిమాను అంకితం చేస్తున్నానని ఆయన సోషల్ మీడియాలో రాసిన భావోద్వేగపూరిత పోస్ట్ అందరినీ కదిలిస్తోంది.

జయశంకర్ తన పోస్ట్‌లో ఇలా రాశాడు –

“రేపటి నుంచి ‘అరి’ ఇక ప్రేక్షకుల సొంతం. కానీ నాకు ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకం. ఈ ప్రయాణంలో నా జీవితంలోని రెండు మూలస్తంభాలు – నా తండ్రిగారు, బావగారు – మరణించారు. నేను వారిద్దరినీ కోల్పోయాను. కానీ ‘అరి’ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్‌లో వారి ఆశీస్సులు ఉంటాయి. ఈ సినిమాను వారిద్దరికీ అంకితం చేస్తున్నాను.”

https://www.instagram.com/p/DPlPT5Hk_Bo/?igsh=NG96NTlsYmtuMDBr

ఈ మాటలు చదివిన వారందరినీ ఆవేశపరిచాయి. దర్శకుడు జయశంకర్ చూపిన కష్టానికి, తన జీవితంలో ప్రియమైన వారిపై ఉన్న ప్రేమకు ప్రేక్షకులు, సినీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *