పేపర్ బాయ్’ చిత్రంతో దర్శకుడిగా జయశంకర్‌కు ఎంతో మంచి పేరు వచ్చింది. ఆ మూవీతో టాలీవుడ్లో జయశంకర్ తన ముద్ర వేశారు. సున్నితమైన అంశాలతో, అందమైన, బాధ్యతాయుతమైన ప్రేమ కథను తెరకెక్కించి అందరినీ ఆకట్టుకున్నారు. తొలి సినిమా పేపర్ బాయ్ పెద్ద హిట్ అయింది. ఆ సినిమా పేరు దేశం నలుమూలల్లో వినిపించింది. ఎప్పటికీ ప్రజలు గుర్తు పెట్టుకునే ప్రేమకథను ఫస్ట్ మూవీతోనే అందించాడు. అలాంటి ఓ గొప్ప చిత్రం తరువాత జయశంకర్ ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తాడు? అనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. ఇప్పుడు ఏడు ఏళ్ల తర్వాత ఆయన రూపొందించిన చిత్రం ‘అరి (My Name is Nobody)’ అక్టోబర్ 10న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
7 ఏళ్ల టైం ఎందుకు తీసుకున్నాడు ?
‘పేపర్ బాయ్’ తర్వాత చేసే చిత్రం కూడా అంతే స్థాయిలో ఉండాలని, అలానే ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోవాలని జయ శంకర్ అనుకున్నారు. ప్రజలు గుండెల్లో పెట్టుకునేలా ఉండాలని , అలా జరిగాలని అంటే ఇంత వరకి ఎవరు టచ్ చేయని పాయింట్‌ని చెప్పాలి అని డిసైడ్ అయ్యారు .. అందుకే ‘అరి’ అనే కొత్త పాయింట్‌ను అందరి ముందుకు తీసుకు వచ్చారు.
అరి అంటే శత్రువు , అరిషడ్వర్గాల్లో మెదటి రెండు పదాలు తీసుకోని అ సినిమాకి పేరు పెట్టారు. సిల్వర్ స్క్రీన్ మీద ఇంత వరకు రాని కాన్సెప్ట్‌తో ‘అరి’ చిత్రాన్ని తెరకెక్కించారు. అరి షడ్వర్గాల కాన్సెప్ట్‌కు మైథలాజికల్ టచ్ ఇస్తూ దర్శకుడు ఎంతో లోతైన పరిశోధన చేశారు. కథను రాయడానికి పురాణేతిహాసాల్ని తిరగేశారు. రమణ మహర్షి ఆశ్రమం తో పాటు చాలా మంది గురూజీలను కలిసి, వాళ్ళ టైం కోసం వెయిటింగ్ చేశారు. వారి నుంచి ఎన్నెన్నో గొప్ప విషయాలను సేకరించారు.
అరిషడ్వర్గాలని అదుపులో ఎలా పెట్టుకోవాలో ఇంత వరకి గ్రంథాలలో ఎక్కడా చెప్పలేదు.. ఎందుకు?.. అని గురూజీలను అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా కొంత కాలం ఆశ్రమంలో గడిపి ఆధ్యాత్మిక కోణంలో అరి షడ్వర్గాల మీద అధ్యయనం చేశారు. అలా సేకరించిన విషయాలని ప్రజలకి ఉపయోగపడేలా అనేక సంవత్సరాలు కష్టపడి తన మేకింగ్ స్టైల్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ సినిమాను రిలీజ్ కి ముందే పలు అంతర్జాతీయ వేదికలలో ప్రదర్శించడం , దాదాపు 25 అవార్డులు సాధించడం గమనార్హం. దేశంలోని ప్రముఖ రాజకీయ, సినీ, పీఠాధిపతులు ఈ చిత్రాన్ని వీక్షించి ప్రశంసలు కురిపించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు , కిషన్ రెడ్డి, యోగి అధిత్యనాథ్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన పాటలు భారీ స్పందనను తెచ్చుకున్నాయి. ‘చిన్నారి కిట్టయ్య’ సాంగ్ ప్రతి కల్చరల్ ఫంక్షన్, ఆలయ ఉత్సవాల్లో తప్పక వినిపించే బ్లాక్‌బస్టర్‌గా మారింది. ‘భాగా భాగా’ పాట తన లిరికల్ విలువతో ప్రేక్షకుల హృదయాలను తాకుతోంది. ప్రొడ్యూసర్ సురేశ్ బాబు ఒక మూవీని తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటేనే అది కచ్చితంగా ఓ గొప్ప, మంచి చిత్రమని, తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఇండస్ట్రీలో అందరికీ ఉంటుంది. సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం అక్టోబర్ 10న థియేటర్లోకి రాబోతోంది. అరుదైన కాన్సెప్ట్, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రాఫ్ట్, మ్యూజికల్ హైలైట్స్‌తో ‘అరి’ అందరి ముందుకు రాబోతోంది.
The Filmmaker Who Left Fame for 7 Years in the Himalayas — and Returned with a Film Like a New Bhagavad Gita"
byu/unregular999 intollywoodreal
The Filmmaker Who Left Fame for 7 Years in the Himalayas — and Returned with a Film Like a New Bhagavad Gita"
byu/unregular999 intollywoodreal
