సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మాణంలో, నూతన యువ నటుడు అమిత్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘1000 వాలా‘. ప్రముఖ నటులు సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చ్ 14 న థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
ఈ సందర్భంగా హీరో అమిత్, ప్రొడ్యూసర్ షారుఖ్ మాట్లాడుతూ, “ప్రేమ అనేది ప్రతి మనిషి జీవితంలో ఓ ప్రత్యేకమైన అనుభూతి. మా సినిమా 1000 వాలా ప్రేమ, అనుభూతి, యాక్షన్, ఎమోషన్‌లతో మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా రూపొందింది. మా సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది, మార్చి 14న థియేటర్లలో విడుదల అవుతుంది. నా కలను నిజం చేసిన మా నిర్మాత షారుఖ్ కు ధన్యవాదాలు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.” అని చెప్పారు. 1000 వాలా’ సినిమా మంచి కమర్షియల్ కథతో తీశామని, పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా విడుదల చేసిన ప్రతి కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. మార్చి 14న విడుదల అవుతున్న మా సినిమాకి సైతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. సుమారు 150 థియేటర్లలో సినిమాని గ్రాండ్ రిలీజ్ చేద్దామని మా డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడుతున్నాం అని చెప్పుకొచ్చారు. అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.